కేటీఆర్‌‌‌‌‌‌‌‌ అనుచరుడు రామ్మోహన్‌‌‌‌‌‌‌‌ అరెస్ట్‌‌‌‌‌‌‌‌

కేటీఆర్‌‌‌‌‌‌‌‌ అనుచరుడు రామ్మోహన్‌‌‌‌‌‌‌‌ అరెస్ట్‌‌‌‌‌‌‌‌
  • ప్రభుత్వ భూమిని కబ్జా చేసి క్వారీ నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు
  • కేసు నమోదు, 14 రోజుల రిమాండ్‌‌‌‌‌‌‌‌

రాజన్న సిరిసిల్ల, వెలుగు : కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రధాన అనుచరుడు బొల్లి రామ్మోహన్‌‌‌‌‌‌‌‌పై భూ కబ్జా కేసు నమోదు అయింది. ఈ కేసులో అతడిని పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... రామ్మోహన్‌‌‌‌‌‌‌‌ సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్దాపూర్‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమంగా కంకర క్వారీ నిర్వహిస్తున్నారని కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో పనిచేసే రెవెన్యూ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ గుగ్గిళ్ల వేణు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం ఉదయం ఆరు గంటలకు వాకింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న రామ్మోహన్‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకొని జిల్లా కోర్టులో హాజరుపరిచారు. 

దీంతో ఆయనకు మెజిస్ట్రేట్‌‌‌‌‌‌‌‌ 14 రోజుల రిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. రామ్మోహన్‌‌‌‌‌‌‌‌ సిరిసిల్లలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో కీలకంగా పనిచేస్తూ, కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సిరిసిల్ల పట్టణ బీసీ సెల్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడితో  పాటు ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.