CM క్యాంప్ ఆఫీసులో డ్రై డే పాటించారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. నిన్న జిహెచ్ఎంసీ సమీక్షలో పిలుపునిచ్చి.. ఇవాళ ఆచరించారు కేటీఆర్. నీళ్లల్లో దోమల నివారణ మందు వేసి ఇంటి ఆవరణలో చల్లారు. పూలకుండీల్లో నిల్వ వున్న నీటిని తొలగించారు. ప్రతి ఒక్కరు వారి ఇండ్లల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. చెత్త చెదారం తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు.. మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల నివారణకు ప్రజల భాగస్వామ్యం అత్యవసరం అని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ డ్రైవ్ లో పాల్గొనాలని కోరారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి లోపల.. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఇంటి లోపల పేరుకుపోయిన, వినియోగంలో లేని వస్తువులను తొలగించుకోవాలని.. ఇళ్లలో నీటి తొట్లు, పూలమొక్కలు ఉన్న చోట్లలో నీరు నిలువకుండా చూడాలని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో సీజనల్ వ్యాధుల నివారణ సులభమవుతుందని మంత్రి చెప్పారు.