- ఖండించిన మెడికవర్ హాస్పిటల్స్ ఎండీ, చైర్మన్ డా.అనిల్‌కృష్ణ
- మెడికవర్ హాస్పిటల్స్ కు పొలిటికల్ పార్టీలతో సంబంధం లేదు
మాదాపూర్, వెలుగు: మెడికవర్ హాస్పిటల్స్‌కు, పొలిటికల్పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని హాస్పిటల్స్ ఎండీ, చైర్మన్ డా.అనిల్‌కృష్ణ తెలిపారు. మెడికవర్ హాస్పిటళ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవన్నారు. ఈ మేరకు బుధవారం మాదాపూర్మెడికవర్ హాస్పిటల్లో డా.అనిల్ కృష్ణ మీడియాతో మాట్లాడారు.
హైటెక్ సిటీలో మాజీ సీఎం కేసీఆర్చేతుల మీదుగా మాక్స్ క్యూర్ ప్రారంభించారని, ఆ తర్వాత మెడికవర్ హాస్పిటల్స్ స్వీడిష్(యూరోపియాన్) కంపెనీ వారికి మెజారిటీ స్టేక్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకలో మెడికవర్ హాస్పిటల్స్ ద్వారా సేవలు అందిస్తున్నామని చెప్పారు. మొత్తం 24 హాస్పిటల్స్‌ను ఆయా సందర్భాలలో ఎవరెవరు అధికారంలో ఉన్నారో వారిచేత ప్రారంభించడం జరిగిందన్నారు.
మెడికవర్ 13 దేశాలలో సేవలందిస్తోందని, వీటిలో జర్మనీ, స్వీడన్, పోలాండ్, టర్కీ, బెలారస్, బల్గేరియా, జార్జియా, హంగేరీ, రొమేనియా, సెర్బియా, మోల్డోవా, ఉక్రెయిన్, భారతదేశం ఉన్నాయన్నారు. తమ హాస్పిటల్లో పనిచేస్తున్న సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అన్నం శరత్ రెడ్డి మాక్స్‌బీన్ ఫార్మాలో డైరెక్టర్ కాదని వెల్లడించారు. సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అన్నం శరత్ రెడ్డి,- డైరెక్టర్ హరికృష్ణ , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాల్గొన్నారు.