మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు తీవ్ర అవమానం జరిగింది. ప్రొఫెసర్ సాయిబాబా బౌతిక కాయానికి నివాళులు అర్పించటానికి వచ్చిన కేటీఆర్ ను.. అడ్డుకున్నారు ఉద్యమకారులు, పౌరహక్కుల సంఘం నేతలు. కేటీఆర్ గో బ్యాక్.. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
నిరసనలకు కారణం ఇదే :
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు.. ఉద్యమకారులు, పౌరహక్కుల నేతలపై ఉక్కుపాదం మోపిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపా వంటి తీవ్రమైన కేసులు పెట్ట జైళ్లల్లో పెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరాం, విమలక్క వంటి వారిపై కేసులు పెట్టించి.. వేధించి.. జైళ్లకు పంపించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని.. అలాంటి కేటీఆర్.. ఇప్పుడు సాయిబాబాకు ఎలా నివాళులు అర్పిస్తారంటూ ప్రశ్నించారు.
కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఉద్యమకారులు, హక్కుల నేతలు, కార్యకర్తలను తీవ్రంగా అణచివేసింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు ఉద్యమ, హక్కుల కార్యకర్తలు.
ఉద్యమకారుల ఆగ్రహంతో.. గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నా కేటీఆర్ మౌనంగా ఉన్నారు.. నివాళులు అర్పించి మౌనంగా వెనుదిరిగారు. కనీసం సమాధానం కూడా చెప్పలేకపోయారు కేటీఆర్. తీవ్ర అవమానం, చేదు అనుభవంతో అక్కడి నుంచి వచ్చేశారు కేటీఆర్..