![మహేందరన్నా బాగేనా : కేటీఆర్](https://static.v6velugu.com/uploads/2025/02/ktr-greets-congress-leader-kk-mahender-reddy-in-sircilla_k3nyaoRqGC.jpg)
- సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకేను పలకరించిన కేటీఆర్
రాజన్నసిరిసిల్ల, వెలుగు : ‘ఏం మహేందరన్నా బాగేనా.. దర్శనం మంచిగా చేసుకో’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డిని పలకరించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రెడ్డి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కట్టిన గణపతి ధ్వజయుక్త శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయ ప్రతిష్ఠాపనకు కేటీఆర్ హాజరయ్యారు.
పూజల అనంతరం తిరుగు వెళ్తున్న కేటీఆర్‌కు అప్పుడే వచ్చిన కేకే మహేందర్‌రెడ్డి ఎదురయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్... కేకేను పలకరించారు. దర్శనం మంచిగా చేసుకో అని కేటీఆర్ అనగా.. మీ దర్శనం బాగా అయ్యిందని మహేందర్‌రెడ్డి బదులిచ్చారు.