ప్రగతి భవన్లో అసంతృప్తి నేతలతో భేటీ

మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ప్రకటనకు ముందు ప్రగతి భవన్ లో  పార్టీ నేతలతో కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. టికెట్ ఆశిస్తున్న ఆశావహులందరితో సమావేశం జరిపి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక నాయకులు, జిల్లా నాయకులు, సర్వే రిపోర్టుల వివరాలను ఈ సందర్భంగా పార్టీ నేతలకు వివరించినట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎవరైతే పోటీ ఎలా ఉంటుంది.. అనే విషయాలను లోతుగా వివరించి తెలియజేసి.. అంతిమ నిర్ణయానికి అందరూ కట్టుబడేలా సర్దిచెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. జిల్లా నేతలు, నియోజకవర్గ నేతలు, స్థానిక ప్రజలు, ప్రత్యర్థి పార్టీల బలాబలాలు.. పోటీ వివరాలను విశ్లేషిస్తూ వివరించడంతో అంతిమ నిర్ణయం మీ ఇష్టం అంటూ అందర్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంలో జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి,మాజీ ఎంపీ బుర నర్సా గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నట్లు సమాచారం.