హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29 వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నష్టం జరుగుతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రూప్1 అభ్యర్థులకు అండగా ఉండేందుకు, వారి తరఫున తామే సుప్రీంకోర్టులో కేసు వేశామని, కపిల్ సిబల్‌ను లాయర్‌గా పెట్టామని వెల్లడించారు.
తాము లేవనెత్తిన అంశాలను కోర్టు వ్యతిరేకించలేదన్నారు. ఈ అంశంలో తుది తీర్పు వచ్చే వరకూ గ్రూప్1 ఫలితాలను విడుదల చేయొద్దని కోర్టు ఆదేశించిందన్నారు. గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన జీవో 48పైన కూడా కోర్టులో కొట్లాడుతామని కేటీఆర్ తెలిపారు. తాను జర్నలిస్టులను అవమానించలేదని, జర్నలిస్టులంటే తనకు మొదట్నుంచి గౌరవం ఉందన్నారు. తాను జర్నలిస్టులను అవమానించినట్టుగా వస్తున్న ఆరోపణలను ఖండించారు. పత్రికలు, టీవీ చానెళ్ల యాజమాన్యాలు తెలంగాణను వ్యతిరేకించినా, జర్నలిస్టులు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని కేటీఆర్ గుర్తు చేశారు.
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు తిరస్కరించాలి
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీజీ ఈఆర్సీ) చైర్మన్ శ్రీరంగారావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.