గ్రూప్1 అభ్యర్థులతో ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు జరపాలి: కేటీఆర్

గ్రూప్1 అభ్యర్థులతో ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు జరపాలి: కేటీఆర్
  • గ్రూప్1 వాయిదా వేస్తే..కొంపలేమీ మునగవ్​
  • గ్రూప్1 అభ్యర్థులతో ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు జరపాలి: కేటీఆర్ 
  • రేవంత్​ను కాపాడేందుకే బండి సంజయ్ తాపత్రయమని ఎద్దేవా

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ వన్ ఎగ్జాంను వాయిదా వేస్తే కొంపలు ఏమీ మునిగిపోవని బీఆర్ఎస్​వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజా పాలన అంటూనే  నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు. గ్రూప్ వన్ వాయిదా వేయాలంటూ ఆందోళనలో పాల్గొన్న బీఆర్‌‌ఎస్ నేతల అరెస్ట్‌‌ను ఆయన ఖండించారు. గ్రూప్ వన్ అభ్యర్థులతో చర్చలు జరిపేందుకు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. 

శనివారం హైదరాబాద్‌‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ‘‘ఎగ్జామ్ వాయిదా వద్దనేందుకు సహేతుకమైన కారణాలేమైనా ఉంటే చెప్పండి. లేదంటే వాయిదా వేయండి. కొన్ని రోజులు వాయిదా వేస్తే కొంపలేమీ మునిగిపోవు” అని అన్నారు. తమ నాయకులను అరెస్ట్ చేసినట్టే కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌ని ఎందుకు అరెస్ట్ చేయలేదని, ఆయనకు ఎందుకు సీఆర్‌‌‌‌పీఎఫ్ భద్రత కల్పించి పంపించారని కేటీఆర్ ప్రశ్నించారు. బండి సంజయ్‌‌ని ముందు పెట్టి చర్చలు అంటూ డ్రామా చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.