
మాకు తెలంగాణ అస్థిత్వం ముఖ్యం..తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్సే అన్నారు కేటీఆర్.చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్..అధికారం కోసం మేం ఏనాడు పనిచే యలేదు..ప్రజలకోసం ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ప్రతిపక్షంగా ఎండగడతామన్నారు. ప్రజల త్యాగాలు వృధా కాకుండా పోరాటం చేస్తామన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి 25యేళ్ల చరిత్ర ఉంది. చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్..తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ ఎస్ ఒక్కటే అన్నారు కేటీఆర్. పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తామన్నారు కేటీఆర్. ప్రజలను మమేకం చేస్తూ రజతోత్సవాలను నిర్వహిస్తామన్నారు.
Also Read : అమెరికాకు కేసీఆర్!..అందుకోసమేనా?
రాబోయే వారం రోజుల్లో కమిటీలు వేస్తామన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం పటిష్టం చేస్తామన్నారు. ఏప్రిల్ రెండో వారంలో పార్టీ ప్రతినిధులు భేటీ ఉంటుందన్నారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.