- ‘మేడిన్ తెలంగాణ మాల్’ పోర్టల్ ను లాంచ్ చేసిన కేటీఆర్
- రాష్ట్రంలోని బెస్ట్ కంపెనీలకు ఇండస్ట్రీ అవార్డులు
- ఎంఎస్ఎంఈల కోసం మరిన్ని చర్యలుంటాయి
- సీఐఐ ‘మాన్ఎక్స్-2021’లో కేటీఆర్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కంపెనీలు తమ ప్రొడక్ట్‌లను, సర్వీస్‌లను కస్టమర్లకు అమ్మేందుకు ‘మేడిన్ తెలంగాణ మాల్’ పోర్టల్‌ను రాష్ట్ర ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ సోమవారం లాంచ్ చేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ) తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మాన్యుఫాక్చరింగ్ ఎక్స్‌లెన్స్ 17 వ ఎడిషన్ ‘మాన్‌ఎక్స్–2021’ లో ఈ పోర్టల్‌ను లాంచ్ చేశారు. ఈ పోర్టల్ ద్వారా సెల్లర్లు తమ ప్రొడక్ట్‌లను ఎటువంటి కమీషన్ చెల్లించకుండానే అమ్ముకోవచ్చు. రాష్ట్రంలో దొరికే హోమ్ డెకరేషన్ ప్రొడక్ట్‌లు, అప్లియెన్స్‌లు, కన్సల్టింగ్ సర్వీస్‌లు, ఇతర క్రాఫ్ట్‌లు, కేవలం రాష్ట్రంలోనే దొరికే ప్రొడక్ట్‌లను ఈ పోర్టల్ ద్వారా అమ్ముకోవచ్చు. సెల్లర్లు వచ్చే ఏడాది జనవరి లోపు రిజిస్టర్ అవ్వడానికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పబ్లిక్ కోసం ‘మెడిన్ తెలంగాణ మాల్’ పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. పీఎల్‌ఐ రాయితీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం ప్రారంభించింది. ఎలక్ట్రానిక్స్ సెక్టార్‌లో రిజల్యూట్ గ్రూప్‌కు పీఎల్‌ఐ బెనిఫిట్స్‌ను మంజూరు చేసింది.
ఎంఎస్‌ఎంఈలు కీలకం..
ఎకానమీకి చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) వెన్నెముక లాంటివని, వీటికి ఆత్మనిర్భర్ భారత్‌ను మించి సాయం అందించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ ఈ ఈవెంట్‌లో పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోందని చెప్పారు. సీఐఐ– రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఎంఎస్‌ఎంఈల కోసం క్లస్టర్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చిందని అన్నారు. పర్యావరణానికి హాని చేయని కంపెనీలను ప్రమోట్ చేయడం, నెట్ జిరో ఎమిషన్స్ కాన్సెప్ట్‌ను ముందుకు తీసుకెళ్లడం వంటివి చేస్తున్నామని చెప్పారు. ఐటీ సెక్టార్ విస్తరిస్తుండడంతో తెలంగాణ వేగంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
టాప్ కంపెనీలకు అవార్డులు..
ఈ ఈవెంట్‌లో రాష్ట్రంలోని బెస్ట్ కంపెనీలకు ఇండస్ట్రీ అవార్డులను కేటీఆర్ ప్రదానం చేశారు. వరసగా నాలుగో సారి కూడా ఈ అవార్డుల ప్రాసెస్‌ను రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి గ్లోబల్ లింకర్ హోస్ట్ చేసింది. మొత్తం 6 కేటగిరీలలో ఈ అవార్డులను ఇచ్చారు. బెస్ట్ ఎక్స్‌పోర్ట్స్, బెస్ట్ ఇన్నొవేషన్, బెస్ట్ సస్టయినబిలిటీ, బెస్ట్ స్టార్టప్, బెస్ట్ సీఎస్‌ఆర్, స్పెషల్ కంట్రీబ్యూషన్ (ఐటీ సర్వీసెస్) కేటగిరీల కింద కంపెనీలకు ఈ అవార్డులను ఇచ్చారు. ఈ ఈవెంట్‌లో ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, కమీషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ మానిక్క రాజ్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నరసింహ రెడ్డి, ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ మాజీ అడ్వయిజర్ యెర్రమ్ రాజు, గ్లోబల్ లింకర్ ఫౌండర్ సమీర్ వకిల్, ఇతరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని ఈ కంపెనీలకే అవార్డులొచ్చాయ్..
బెస్ట్ ఎక్స్‌పోర్ట్..
1) కళ్యాణి రఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (గోల్డ్ అవార్డ్)
2) ఆప్టిమస్ డ్రగ్స్( సిల్వర్)
3) నవ భారత్ వెంచర్స్ (బ్రాంజ్)
4) శ్రీ మలాని ఫోమ్స్ (బ్రాంజ్)
బెస్ట్ ఇన్నొవేషన్..
1) భారత్ బయోటెక్ (గోల్డ్)
2) స్క్రైరూట్ ఎరోస్పేస్ (సిల్వర్)
3) సెన్సా కోర్ మెడికల్ (సిల్వర్)
4) ఆప్టిమస్ డ్రగ్స్ (బ్రాంజ్)
బెస్ట్ సస్టయినబిలిటి..
1) ఎల్ & టీ మెట్రో రైల్ హైదరాబాద్ (గోల్డ్)
2) రోలిగ్ట్ ఫుడ్స్ (సిల్వర్)
3) కంట్రోల్ ఎస్ డేటాసెంటర్స్ (సిల్వర్)
4) కేతన్ కొర్రు కేస్ (బ్రాంజ్)
బెస్ట్ సీఎస్‌ఆర్..
1) నవ భారత్ వెంచర్స్ (గోల్డ్)
2) జేకే ఫెన్నర్ (ఇండియా) (సిల్వర్)
3) మహీంద్రా అండ్ మహీంద్రా (బ్రాంజ్)
బెస్ట్ స్టార్టప్..
1) మైత్రి ఆక్వాటెక్ (గోల్డ్)
2) బెఫక్ 4x (సిల్వర్)
3) హెసా టెక్నాలజీస్ (బ్రాంజ్)
స్పెషల్ కంట్రిబ్యూషన్ (ఐటీ సర్వీసెస్)..
1) టీసీఎస్ (లార్జ్ కేటగిరీ)
2) 24–7 ఇన్‌టచ్ (క్నోహ్)(మీడియం కేటగిరీ)