భారీ వర్షం.. ప్లీనరీ మధ్యలోనే వెళ్లిపోయిన కేటీఆర్

 రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో  వర్షం అడ్డంకిగా మారడంతో బీఆర్ఎస్ మినీ ప్లీనరీ మధ్యలోని నిలిచిపోయింది. మీటింగ్ సమయానికి భారీ వర్షం పడింది. దీంతో   వర్షం పడుతుండగానే  సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు మంత్రి కేటీఆర్.  

సభా ప్రాంగణం మొత్తం తడిసిముద్దయింది. బీఆర్ఎస్ కార్యకర్తలు ,నాయకులు,  టెంటులోనే చాలా ఇబ్బంది పడ్డారు.  ప్లీనరీకి ఏర్పాటు చేసిన ఎల్ ఈడీ స్క్రీన్లు గాలికి పడిపోయి. ఏప్రిల్ 25న  రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ మినీ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యర్తలు, పార్టీ శ్రేణులు సమావేశాల్లో పాల్గొన్నారు.