-
నామా గెలిస్తే కేంద్ర మంత్రి ఎలా అయితడు
-
బీఆర్ఎస్ కు రెండో స్థానం వస్తే దేనికైనా సిద్ధం
-
కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు
హైదరాబాద్: కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు అని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఎద్దేవా చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ,కేటీఆర్ పెద్ద అబద్ధాల కోరులని మండిపడ్డారు. ఎన్నికలు కాక ముందే బీఆర్ఎస్ బీజేపీ తో కుమ్మక్కు అయ్యిందని ఆరోపించారు. నామా నాగేశ్వర్ రావు గెలిస్తే కేంద్ర మంత్రి అయితడని కేసీఆర్ ఎలా అన్నాడని ప్రశ్నింంచారు. దీన్ని బట్టి వాళ్ల ఫెవికాల్బంధం బయటపడిందన్నారు. తాను, కేకే మహేందర్ రెడ్డి ఉద్యమం కోసం కష్ట పడ్డామన్నారు. కరీంనగర్ లో బీఆర్ ఎస్ కు రెండో స్థానం వస్తే తాను దేనికైనా సిద్ధమని, ఒకవేళ మూడో స్థానం వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా అని కేటీఆర్ కు సవాల్ విసిరారు. నేతన్నల చావుకు కేటీఆర్ కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో కి రాగానే నేతన్నల బకాయిలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారని తెలిపారు.