రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్ లను గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని టీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. జిల్లా,మండల పరిషత్ ఎన్నికలకు వారం, పది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ ఘన విజయంసాధించడం ఖాయమన్నారు. శనివారం తెలంగాణభవన్ లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. సోమవారం సీఎం కేసీఆర్ స్థానిక సంస్థలపై నిర్వహించనున్న సన్నాహక సమావేశంపై ఇందులో చర్చించారు. ‘‘ఎంపీటీసీ, జడ్పీటీసీఎన్నికల్లో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలి. టీఆర్‌ఎస్ మొత్తం జడ్పీలతోపాటు 530కి పైగా మండల పరిషత్ చైర్మన్ పీఠాలు దక్కించుకోవడం ఖాయం. రాష్ట్రంలో అన్నిఎన్నికల్లో కాంగ్రెస్, ఇతరపార్టీలు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటున్నాయి. లోక్ సభ ఎన్నికల్లోనూ అదే జరగబోతుంది.16సీట్లలో టీఆర్‌ఎస్ విజయం సాధించబోతుంది. ఇదేట్రెండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొనసాగుతుంది’అని అన్నారు.
ఎంపీ నియోజకవర్గాల వారీగా పార్లమెంట్ పోలింగ్‌పై కేటీఆర్ చర్చించారు. జిల్లాల్లోప్రస్తుత పరిస్థితిపైనా సమీక్షించారు. నెల రోజులుగాఎంపీ క్యాండిడేట్ల గెలుపు కోసం విస్తృతంగా పనిచేశామని, ఇదే తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పనిచేయాలన్నారు . స్థానిక ఎన్నికలపై సోమవారం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారని, మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ భేటీకి పార్టీ ప్రధానకార్యదర్శులు, కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీ క్యాండి డేట్లు , నియోజకవర్గాల ఇన్ చార్జిలు, కార్పొరేషన్ల చైర్మన్ లు, జడ్పీ చైర్మన్ లు,మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలుసహా 400 మంది కీలక నేతలను ఆహ్వానిం చాలని నిర్ణయిం చారు. ఈ సందర్భంగా కేటీఆర్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి కలిశారు.