
మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులను చెన్నై లోని వారి నివాసంలో కలిశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్. తమిళనాడు లో ఆల్ పార్టీ మీటింగ్ కు హాజరైన కేటీఆర్ బృందం.. తెలంగాణకు సుదీర్ఘ కాలం గవర్నర్ గా పనిచేస నరసింహన్ ను కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
నరసింహన్ దంపతులను శాలువాతో సత్కరించి, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని బహుకరించారు. కేటీఆర్ తో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు నరసింహన్ దంపతులను కలిశారు.
ALSO READ | డీలిమిటేషన్ తో తీవ్ర నష్టం.. భారత జీడీపీకి దక్షిణాది రాష్ట్రాలే ఆయువు పట్టు: కేటీఆర్