ఫార్ములా ఈ కేసు.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేటీఆర్

ఫార్ములా ఈ కేసు.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేటీఆర్

ఫార్ములా ఈ రేసింగ్ కేసులో హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టి వేయడాన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని సుప్రీం కోర్టును కోరారు. తనపై ఏసీబీ దాఖలు చేసిన FIR ను క్వాష్ చేయాల్సిందిగా పిటిషన్ లో పేర్కొన్నారు కేటీఆర్.

అయితే  తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ కేసులో ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు గానే ఆశ్రయించింది. ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. 

అసలు కేటీఆర్పై నమోదైన కేసు ఏంటంటే..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం రూ.55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించారు. అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేఖ రాసింది.

ALSO READ | పార్టీ ఆఫీసులపై దాడులు చేయొద్దు.. అది కాంగ్రెస్ సంస్కృతి కాదు: డిప్యూటీ సీఎం భట్టీ

ఏసీబీకి కూడా మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేసింది. ఏసీబీ రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఫార్ములా ఈ రేస్‌‌‌‌‌‌‌‌ కోసం జరిగిన బ్యాంక్ లావాదేవీలపై ఏసీబీ ఆరా తీసింది. హెచ్ఎండీఏ నుంచి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ అయిన నిధులు.. ఏ అకౌంట్స్లోకి చేరాయనేది కూడా గుర్తించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనే డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు తేల్చింది. ఈసీ నుంచి అనుమతులు తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించారని తేలింది.

2023 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 3, 11వ తేదీల్లో హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డు అకౌంట్‌‌‌‌ నుంచి రూ.45.71 కోట్లు లండన్‌‌‌‌లోని ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌‌‌‌కు తరలించారు. ఇందుకు గాను ఆర్బీఐ రూల్స్ పాటించనందున హెచ్‌‌‌‌ఎండీఏ రూ.8 కోట్లను ఐటీ శాఖకు పెనాల్టీగా చెల్లించాల్సి వచ్చింది. ఫెడరేషన్ ఆఫ్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ క్లబ్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌‌‌‌ఐఏ)కు రూ.1.10 కోట్లు చెల్లించారు. ఇలా మొత్తం రూ.54.89 కోట్లు మున్సిపల్ నిధులను అప్పటి  మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ దుర్వియోగం చేశారని ఏసీబీ ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.