కవితతో కేటీఆర్ ములాఖత్

కవితతో కేటీఆర్ ములాఖత్
  •     దాదాపు రెండు నెలల తర్వాత చెల్లెను కలిసిన అన్న 

న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైల్‌‌‌‌‌‌‌‌లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఆమె అన్న కేటీఆర్ ములాఖత్ అయ్యారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు తిహార్ జైలుకు చేరుకున్న కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. దాదాపు 20 నిమిషాల పాటు కవితతో మాట్లాడారు. ఈ సందర్భంగా న్యాయ సంబంధమైన అంశాలపై చర్చించారు. అలాగే, ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యం వీడొద్దని, తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్‌‌‌‌‌‌‌‌పై తీర్పు రిజర్వ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నందున.. ఆ తీర్పు ప్రతికూలంగా వస్తే ఏం చేయాలనే దానిపై కూడా చర్చించారు. ఇక ఢిల్లీలో ఎండల తీవ్రత నేపథ్యంలో కవితకు కల్పించిన వసతులపై ఆరా తీశారు. 

తాను మానసికంగా చాలా ధైర్యంగా ఉన్నానని, ఆందోళన చెందొద్దని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కవిత చెప్పారు. దాదాపు రెండు నెలల తర్వాత కవితను కేటీఆర్ కలిశారు. ఏప్రిల్ 14న చివరిసారి సీబీఐ కస్టడీలో ఉన్న కవితను బావ అనిల్‌‌‌‌‌‌‌‌తో కలిసి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ములాఖత్ అయ్యారు. లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అయి సరిగ్గా శనివారానికి మూడు నెలలు పూర్తవుతోంది. ఈ వ్యవహారంలో ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత పెట్టుకున్న మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ విషయంలో ఆమెకు నిరాశే మిగిలింది. మరోవైపు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్లానింగ్ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ కూడా తిహార్ జైల్‌‌‌‌‌‌‌‌లో కవితను కలిసి, ఆమెకు ధైర్యం చెప్పారు.