సిరిసిల్ల మున్సిపల్ లో ముసలం.. రంగంలోకి కేటీఆర్

సిరిసిల్ల మున్సిపల్ లో ముసలం నెలకొంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సమావేశం నేపథ్యంలో కౌన్సిలర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైర్ పర్సన్ తో విభేదించి క్యాంపుకు 16 మంది కౌన్సిలర్లు వెళ్లారట. కాగా.. ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి సమావేశానికి పలువురు కౌన్సిలర్లు.. డుమ్మాకొట్టినట్లు సమాచారం. 

మున్సిపల్ లో అవిశ్వాసం దిశగా కౌన్సిలర్లు కదులుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి కొత్త తల నొప్పులు వస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు సొంత పార్టీ లీడర్లే రెడీ అవుతున్నట్లు సమాచారం అందింది. నిధుల కేటాయింపులో వివక్ష చూపడం, కొందరు కౌన్సిలర్ లకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అవిశ్వాసం పెట్టాల్సిందేనని బీఆర్ఎస్ లో కొంతమంది కౌన్సిలర్లు పట్టుబడుతున్నారట.