హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కరీంనగర్ మేయర్ సునీల్ రావుకు బుజ్జింగిపుల పర్వం మొదలైంది. ఈ మేరకు సునీల్ రావుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం (జనవరి 24) రాత్రి ఫోన్ చేశారు. పార్టీని వీడొద్దని ఈ సందర్భంగా సునీల్ రావుకు కేటీఆర్ సూచించారు. భవిష్యత్ బీఆర్ఎస్దేనని.. మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని ధైర్యం చెప్పారు. అలాగే భవిష్యత్‌లో మంచి పదవులు లభిస్తాయని భరోసా ఇచ్చారు. శనివారం (జనవరి 25) బీజేపీలో చేరబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సునీల్ రావు మరీ కేటీఆర్ మాటకు కన్విన్స్ అయ్యి ఆలోచన మార్చుకుంటారా లేదా చెప్పినట్లుగానే కాషాయ పార్టీలో జంప్ అవుతారో చూడాలి.
మరోవైపు.. సునీల్ రావు రాజీనామా ప్రటకనతో మాజీ మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అప్రమత్తమయ్యారు. సునీల్ రావుతో పాటు కొందరు కార్పొరేటర్లు కూడా బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లతో గంగుల రహస్యంగా సమావేశం అయ్యారు. మేయర్‌తో సునీల్ రావుతో ఎవరూ బీజేపీకిలోకి వెళ్లొద్దని కార్పొరేటర్లను గంగుల బుజ్జగిస్తున్నారు. మేయర్ సునీల్ రావు రాజీనామా ప్రకటనతో కరీంనగర్ జిల్లా పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. మేయర్ సునీల్ రావుతో పాటు బీజేపీకి గూటికి ఎవరెవరు వెళ్లబోతున్నారని చర్చలు ఊపందుకున్నాయి.
ALSO READ | కేసీఆర్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్కు పార్టీకి సునీల్ రావు రాజీనామా
కేసీఆర్‌కు సన్నిహితుడు, కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ సమక్షంలో శనివారం (జనవరి 25) బీజేపీలో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. కరీంగనర్ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం 12:00 జాయినింగ్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మరికొన్ని రోజుల్లో కరీంనగర్, నిజామాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో సునీల్ రావు పార్టీని వీడటం గులాబీ పార్టీకి ఎదురు దెబ్బేనని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు.