గట్టుప్పల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్, హరీశ్ రావుకు ఆసక్తికర ఫోన్ సంభాషణ జరిగింది. ఓ యువతికి ఉద్యోగం కావాలంటూ మంత్రి హరీశ్ రావుకు ఫోన్ చేసిన కేటీఆర్.. బావ చిన్న రిక్వెస్ట్ అంటూ మాట్లాడారు. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవాళ(శుక్రవారం) సాయంత్రం మంత్రి కేటీఆర్ గట్టుప్పల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా గట్టుప్పల్ కు చెందిన వికలాంగురాలు యశోద ఉద్యోగం కావాలంటూ తన తండ్రితో కలిసి కేటీఆర్ కు విజ్ఞప్తి చేసింది. అమ్మాయి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ .. నీకు ఏం కావాలి? చదువుకుంటావా? ఉద్యోగం చేస్తావా? అని అడిగారు. జాబ్ చేస్తానని అమ్మాయి కేటీఆర్ కు బదులిచ్చింది. వెంటనే మంత్రి హరీష్ కు ఫోన్ చేసిన కేటీఆర్..‘ హలో బావా.. ఒక రిక్వెస్ట్ గట్టుప్పల్ నుంచి వచ్చిన ఓ అమ్మాయి.. పేరు యశోద.. వికలాంగురాలు కానీ మంచిగ చదువుకుంది. ఆమె ఇంతకు ముందు కామినేని ఆస్పత్రిలో జీఎంఎన్ గా చేసింది. చండూర్ పీహెచ్ సీల ఖాళీ ఉన్నట్లుంది..మీకు వివరాలు వాట్సప్ చేస్తా.. థ్యాంక్యూ బావా’ అంటూ ముగించారు.