వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్ 19 ప్రపంచ కప్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి 15 మందితో కూడిన జట్టును ప్రకటించిన బీసీసీఐ.. పంజాబ్ బ్యాటర్ ఉదయ్ సహారన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఈ జట్టులో ఇద్దరు తెలంగాణ యువకులు ఆరవెల్లి అవనీష్ రావు, మురుగన్ అభిషేక్ చోటు దక్కించుకున్నారు.
ప్రపంచ కప్ జట్టులో తెలంగాణ యువకులు చోటు దక్కించుకోవడంపై రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వీరిద్దరూ కెరీర్‌లో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
మన పోత్గల్ కుర్రాడు..
దక్షిణాఫ్రికాలో జరిగే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ మరియు ట్రై సిరీస్‌లకు ఎంపికైనందుకు ఆరవెల్లి అవనీష్ రావు(వికెట్ కీపర్/ బ్యాటర్)కు హృదయపూర్వక అభినందనలు. ఈ యువ క్రికెటర్ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం పోత్గల్ బిడ్డ.." అని కేటీఆర్ అతన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.
అభిషేక్
అలాగే, హైదరాబాద్ నుంచి అండర్-19 ప్రపంచ కప్ జట్టుకు ఎంపికైన మరో క్రికెటర్ మురుగన్ అభిషేక్(ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్)ను కూడా కేటీఆర్ అభినందించారు. అండర్-19 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన మరో తెలివైన కుర్రాడు మురుగన్ అభిషేక్‌ను కూడా అభినందిస్తున్నా.. ఈ యువకులిద్దరూ మెగా టోర్నీలో రాణించాలని కోరుకుంటున్నా.." అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Would also like to Congratulate another bright lad from Hyderabad, Murugan Abhishek, who made it to the U-19 squad.
— KTR (@KTRBRS) December 14, 2023
Best wishes to both these youngsters ? pic.twitter.com/SGqaA2Tr23
అండర్19 ప్రపంచ కప్‌కు భారత జట్టు: అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్ ), అరవెల్లి అవనీష్ రావు (వికెట్ కీపర్), సౌమ్య్ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (వికెట్ కీపర్), ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ.
ట్రై సిరీస్ రిజర్వ్ ప్లేయర్లు: ప్రేమ్ దేవ్‌కర్ అన్ష్ గోసాయి, మహ్మద్ అమన్.
బ్యాకప్ ప్లేయర్లు: దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, పి విఘ్నేష్, కిరణ్ చోర్మలే.