
రెండున్నర దశాబ్దాల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రెండే పార్టీలు మాత్రమే నిలదొక్కుకున్నాయని ... అందులో ఒకటి బీఆర్ఎస్ పార్టీ అని కేటీఆర్ అన్నారు. భారతదేశంలో ఎన్నో పార్టీలు పుట్టి.. మాయమమయ్యాయన్నారు. తెలంగాణ భవన్ ఇప్పుడు జనతా గ్యారేజ్ లాగా మారిందని ఆయన తెలిపారు.
బాధితులుకు కేవలం గులాబీ జండా మాత్రమే అండగా ఉంటుందని... వరంగల్ గడ్డపై బీఆర్ఎస్ సభలు చరిత్ర సృష్టించాయన్నారు. 40 వేల వాహనాలకు పార్కింగ్ తోపాటు.. 10 లక్షల వాటర్ బాటిల్స్.. 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్దం చేశామన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో కరెంట్ మీద నమ్మకం లేకనే.. సభ కోసం 200 జనరేటర్లు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
ప్రభబండ్లతో సభకు బయలు దేరినవారు ఉద్యమ స్పూర్తిని చాటుతున్నారంటూ.. రెండు వేల మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారన్నారు.BRS చరిత్రలో ఇదొక అతిపెద్ద సభగా నిలువబోతుందంటూ.. KCR ను చూడాలి.. ప్రసంగం వినాలని జనం తాపత్రయం తో ఉన్నారని కేటీఆర్ అన్నారు.
ఏప్రిల్ 27 వ తేది సాయంత్రం 4.30 నిమిషాలకు కేసిఆర్ సభా ప్రాంగణానికి చేరుకుంటారని.. 5.30 నిమిషాలకు ఆయన ప్రసంగం ఉంటుందని తెలిపారు. అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకరించాలన్నారు. కొంతమంది బీఆర్ఎస్ సభకు మరకలు అంటించడం కోసం కొందరు చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కౌశిక్ రెడ్డి పై కేసు కూడా అలాంటి ప్రయత్నమేనని కేటీఆర్ అన్నారు.