ఓ వైపు ఇంటర్ ఎగ్జామ్..మరో వైపు కేటీఆర్ సభ

కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పరీక్ష కేంద్రం దగ్గర కేటీఆర్ బహిరంగ సభకు  ఏర్పాట్లు చేస్తున్నారు  బీఆర్ఎస్ కార్యకర్తలు.   భారీగా జనాన్ని తరలించేందుకు సన్నద్ధం అవుతున్నారు. మధ్యాహ్నం  ఇంటర్ ఎగ్జామ్ పూర్తి కాగానే కేటీఆర్ సభ  ప్రారంభం కానుంది.  ఈ క్రమంలో జూనియర్ కాలేజీ పరిసరాల్లో  పోలీసులు 144 సెక్షన్ విధించారు.

అయితే ఎగ్జామ్ సెంటర్ వద్ద కేటీఆర్ సభ పెడుతుండటంపై  ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి.     ఎగ్జామ్ సెంటర్ దగ్గర పొల్టికల్ మీటీంగ్ లు ఏంటని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు .  ఓ వైపు ఎగ్జామ్స్ జరుగుతుంటే కాలేజీ దగ్గరకు భారీగా జనం వస్తుండటంతో  విద్యార్థులు డిస్టర్బ్ అవుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మార్చి 15న కామారెడ్డి జిల్లాలోని  నిజాంసాగర్, పిట్లం మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు.  ముందుగా నిజాం సాగర్ వద్ద 25 కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్ ను  ప్రారంభించనున్నారు. తర్వాత ప్రభుత్వ జూనియర్ కాలేజ్  దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.