చేవెళ్లలో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సభలో కేటీఆర్ కు అనుకోని షాక్ తగిలింది. నీకు రుణమాఫీ అయ్యిందా అని ఓ వృద్ధురాలిని కేటీఆర్ ప్రశ్నించగా.. నాకు రుణమాఫీ అయ్యిందని కుండబద్ధలు కొట్టింది. అబద్ధమెందుకు.. 25వేల రుణమాఫీ అయ్యింది..మళ్లీ బ్యాంక్ కెళ్లి క్రాఫ్ లోన్ తెచ్చుకున్నానని చెప్పింది. గతంలో మా ఊరికి బస్సు రాకపోయేదని.. ఇప్పుడు వస్తుందని కేటీఆర్ కు మొహం మీదే చెప్పేసింది.
రైతు సభలో మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ మేనిఫేస్టో ప్రకారం రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరుగ్యారంటీల్లో అర గ్యారంటీనే అమలయ్యిందన్నారు. అమలు కానీ హామీలతో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని విమర్శించారు .రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాలనరి కేటీఆర్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ నేతలను నిలదీయాలన్నారు. ఎకరాకు రైతుకు రూ. 17500 రేవంత్ సర్కార్ బాకీ పడిందన్నారు. రాష్ట్రంలో ప్రతీ మహిళకు రూ. 30 వేలు ప్రభుత్వం బాకీ పడిందని చెప్పారు.