
–రేవంత్‌రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్
–క్లారిటీ ఇచ్చిన టీజీఎస్‌పీడీసీఎల్
హైదరాబాద్: కరెంట్ కోతల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి కరెంట్ కోతలు లేవుని, 24 గంటలు నాణ్యమైన కరెంట్‌ను తమ ప్రభుత్వం సరాఫరా చేస్తుందని చెప్పారు. అలా చెప్పి 24 గంటలు కూడా కాకముందే ప్రజలు కరెంట్ కోసం ఉప్పల్‌లో రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారని ట్విట్టర్వేదిగా ఫైర్ అయ్యారు. దీనికి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. అయితే కేటీఆర్ట్వీట్పై టీజీఎస్‌పీడీసీఎల్ స్పందించింది. నిన్న ఈదురుగాలులతో మాత్రమే విద్యుత్‌సరఫరాలో అంతరాయం ఏర్పడిందని క్లారిటీ ఇచ్చింది.