ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు

ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు

ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ACB ముందు విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ ను ముగ్గురు అధికారుల బృందం విచారిస్తుంది. విచారణను ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి పర్యవేక్షిస్తున్నారు. కేటీఆర్ తరపు లాయర్ ఏసీబీ లైబ్రరీ రూంలో కూర్చొని విచారణను చూస్తున్నారు. 

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. కేటీఆర్ విచారణ సందర్భంగా ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే విచారణ తరువాత కేటీఆర్ ఇంటికి వెళ్తారా.. లేకుంటే.. ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉందా అనే ఆందోళనను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. 

విచారణ సమయంలో తన వెంట న్యాయవాదిని తీసుకెళ్లొచ్చని కేటీఆర్ కు హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. విచారణ సమయంలో న్యాయవాది కేటీఆర్ కు ఎలాంటి సహకారం అందించరాని, జోక్యం చేసుకోరాదని కోర్టు స్పష్టం చేసింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం రూ.55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించారు. అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేఖ రాసింది.