ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నియోజక వర్గంలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరారు. కేటీఆర్ తో గుంటకండ్ల జగదీష్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి తదితరులు ప్రయాణించారు. మార్గ మధ్యలో రబీ సీజన్ లో సస్యశ్యామలంగా మారిన పంటపొలాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన హర్షం వ్యక్తం చేశారు.
పర్యటణలో భాగంగా డబుల్ బెడ్రూం ఇండ్లు, గణపురం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన తహసిల్దార్ కార్యాలయం, గాంధీనగర్ లో నిర్మించిన మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల భవనం, దివ్యాంగుల నూతన భవనం, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. సింగరేణి మినీ స్టేడియం, జిల్లా గ్రంథాలయ నూతన భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం అంబేద్కర్ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొంటారు.