-
కాంగ్రెస్ హవా అనేది సోషల్‌మీడియా ప్రచారం మాత్రమే
-
చౌటుప్పల్రోడ్షోలో మంత్రి కేటీఆర్
యాదాద్రి: కాంగ్రెస్‌కు మళ్లీ చాన్సిస్తే తెలంగాణలో అంధకారమేనని మంత్రి కేటీఆర్ విమర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ రోడ్ షోలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ‘రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేసిండో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. డబ్బు మదంతో అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నడు.
బీజేపీ సిద్ధాంతాలను రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో అమలు చేస్తున్నరు. 3 గంటల కరెంట్ చాలని అంటుండు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందో? లేదో? ప్రజలే చెప్పాలి. కాంగ్రెస్ హవా అనేది సోషల్‌మీడియా ప్రచారం మాత్రమే. ఎన్నికల ఫలితాలు రాగానే జాబ్ క్యాలెండర్‌పై దృష్టి సారిస్తం. పీఎం కిసాన్‌కు లేని అడ్డంకి రైతుబంధుకు ఎందుకు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.