
వికారాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు . సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే మళ్లీ బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొస్తాయన్నారు. దళిత బంధు, కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ , వృద్ధులకు పింఛన్, వితంతులకు పింఛన్, వికలాంగులకు పింఛన్ మరెన్నో పథకాలు టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మూడు గంటల కరెంటు ఇస్తామని అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు రైతులకు కరెంటు ఇస్తుంది అని అన్నారు. ఒక్క కేసీఆర్ ని ఢీకొట్టడానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లు మనుషులను తెచ్చకుంటున్నారన్నారు. అయినా సింహం సింగిల్ గా వస్తుంది... పందులు గుంపులుగా వస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. డిసెంబర్ ఇంట్లో ఉండే అత్తకు రూ. 5000 పింఛను, కోడలికి మూడు వేలు, వంటగ్యాసు రూ. 400లకు, భూమిలేని రైతులకు ఐదు లక్షల బీమా, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తామని తెలిపారు