బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నాడు ఈటల రాజేందర్ మోటర్లకు మీటర్లు పెట్టబోమని అంటే.. నేడేమో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మోటార్లకు మీటర్లు పెడతామని అంటోందని చెప్పారు. మోటార్లకు మీటర్లు కావాలంటే ఈటలకు ఓటేయండని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023, నవంబర్ 27వ తేదీ సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తరుపున మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఫైర్ అయ్యారు.
కేటీఆర్ వ్యాఖ్యలు:
- కాంగ్రెస్, బీజేపీ పార్టీల వల్లనే రైతుబంధు ఆగింది.. వారిది దుర్మార్గమైన ఆలోచన.
- కాంగ్రెసోళ్లు, వారి నాయకుడు రేవంత్ రెడ్డి దుర్మార్గుడు.
- డీకే శివకుమార్ 5 గంటల కరెంట్.. రేవంత్ 3 గంటల కరెంట్ చాలు అంటున్నారు.
- రైతుల వద్ద 10 hp మోటార్లు ఉంటాయా?.
- కాంగ్రెస్ ఉన్న చోట కరెంట్ ఉండదు.. కాంగ్రెస్ అనే దరిద్రాన్ని మళ్ళీ తెచ్చు కుందామా?.
- ఓటు వేసేముందు కరెంటు కావాలా?.. కాంగ్రెస్ కావాలా? అని ఆలోచించుకోండి.
- కాంగ్రెస్ నాయకులు రైతు బంధు దుబారా ఖర్చని, ధరణి రద్దు చేస్తామంటున్నారు.
- ధరణి రద్దు చేస్తే.. మళ్లీ తెలంగాణలో పట్వారీలు, దళారీల వ్యవస్థ వస్తుంది.
- బీజేపీ గొప్పలు చెప్తోంది... మోడీ రూ.15 లక్షలు జన్ దన్ ఖాతాలో వేస్తామని.. వేయలేదు .
- రూ.15 లక్షలు వస్తే బీజేపీకి ఓటు వేయండి... రైతు బంధు, దళిత బంధు వచ్చినోళ్లు బీఆర్ఎస్ కు వేయండి.
- ఈటల రాజేందర్ కి ఓటేస్తే.. ఢిల్లీకి పోతది.
- డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ మళ్లీ సీఎం అవుతాడు.
- గెలిచిన తర్వాత కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తాం.
- తెల్ల రేషన్ కార్డు దారులకు జనవరి నుంచి అన్న పూర్ణ పథకం ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తాం .
- రూ.5లక్షల జీవిత బీమా కల్పిస్తాం.
- అసైన్డ్ భూములకు కంప్లీట్ హక్కులు కల్పిస్తాం.
- మహిళా సంఘాలకు భవనాలు కట్టిస్తం.