కాంగ్రెసోళ్లకు మేం చేసిన అభివృద్ధి కనబడతలేదు: కేటీఆర్

రాజన్న సిరిసిల్ల: అభివృద్ధి పనులు చేస్తున్న ముఖ్యమంత్రిని మళ్లోసారి గెలిపించుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. వీర్లపల్లి మండల కేంద్రంలో రోడ్ షోలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని కోరితే రాష్ట్రం ఏర్పడ్డాక 3146 తండాలను గ్రామపంచాయతీలుగా చేశాం.. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నాం. సిరిసిల్ల జిల్లాను చేసి అన్ని విధాలా అభివృద్ది చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెసోళ్లకు మేం చేసిన అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. 

కేంద్రంలో అధికరంలోకి ఉన్న బీజేపీ ఏ ఒక్క హామీ ని కూడా అమలు చేయలేదని ఆరోపించారు మంత్రి కేటీఆర్. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ అభివృద్ధి పనులు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోసారి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు మంత్రికేటీఆర్.