ఏ టైంలో బయటకు రావాల్నోకేసీఆర్​కు తెలుసు: కేటీఆర్

ఏ టైంలో బయటకు రావాల్నోకేసీఆర్​కు తెలుసు: కేటీఆర్

బీఆర్‌‌ఎస్‌‌ అధినేత కేసీఆర్‌‌కు ఎప్పుడు.. ఏ సమయంలో బయటకు రావాల్నో తెలుసన్నారు కేటీఆర్. తెలంగాణ కోసం ఆయన 24 ఏండ్లు కష్టపడ్డారు.  ప్రస్తుతం కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు.  మీడియాతో చిట్​చాట్​లో చెప్పారు కేటీఆర్​.

స్పీకర్ ఫోన్ చేసి రమ్మన్నా రాలె

 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎర్ర వల్లి ఫాంహౌస్​కే పరిమితమైన బీఆర్ఎస్​అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక సందర్భాల్లోనూ బయటకు రావడం లేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​ సంతాప తీర్మానం కోసం సోమవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు సైతం ఆయన హాజరుకాలేదు. ప్రధాని హోదాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన మన్మోహన్​సింగ్​ కడసారి చూపుకోసం కేసీఆర్​ ఢిల్లీ వెళ్తారని అందరూ భావించినా.. ఆయన మాత్రం ఫాంహౌస్​లోనే ఉండిపోయారు. పార్టీ తరఫున వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ను పంపించి, చేతులు దులుపుకొన్నారు. సోమవారం మన్మోహన్ సింగ్​ సంతాప తీర్మానం కోసమే నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి కేసీఆర్ రాకపోవడం చర్చకు దారితీసింది. సంతాప తీర్మానం సందర్భంగా  హరీశ్​రావు మాట్లాడుతూ, పదే పదే కేసీఆర్ పేరు ప్రస్తావించగా.. స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.  ప్రతిపక్ష నేత కేసీఆర్​కు  తాను స్వయంగా ఫోన్​ చేసి సమావేశానికి ఆహ్వానించినా.. ఆయన హాజరుకాలేదని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.