కాంగ్రెస్ గారడీని హర్యానా ప్రజలు తిరస్కరించారు

కాంగ్రెస్ గారడీని హర్యానా  ప్రజలు తిరస్కరించారు

బీఆర్ఎస్​ వర్కింగ్ ​ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్

హైదరాబాద్, వెలుగు : కర్నాటకలో ఐదు గ్యారంటీలు, తెలంగాణలో ఆరు గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను నిలువునా మోసం చేసిందని కేటీఆర్ అన్నారు. కర్నాటక, తెలంగాణను మోసం చేసినట్లుగానే ఏడు గ్యారెంటీల పేరిట మభ్యపెట్టాలని చూసినప్పటికీ  హర్యానా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు.

హామీల అమలులో కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేస్తున్న మోసాన్ని దేశం మొత్తం గమనిస్తోందని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని వెల్లడించారు. అబద్ధపు హామీలతో అధికారం సాధించి ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారనే విషయాన్ని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని కేటీఆర్ పేర్కొన్నారు.