తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 29న దీక్ష దివాస్ : కేటీఆర్

తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 29న దీక్ష దివాస్ : కేటీఆర్


హైదరాబాద్: కాంగ్రెస్ కంబంధ హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన అవసరముందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి  పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిర్బంధాలు మళ్లీ వచ్చాయన్నారు. తెలంగాణపై కేసీఆర్ దీక్ష చెరగని ముద్ర వేసిందని గుర్తుచేశారు. నవంబర్ 29న దీక్షా దివను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్ లో కేటీఆర్ మాట్లాడారు. 

'2009 నవంబర్ 29న తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగింది. 'కేసీఆర్ సచ్చుడో...తెలంగాణ వచ్చుడో' అన్న మాట దేశ రాజకీయాలని కదిలిం చింది. ఉద్యమంలో ఉన్న నిర్బంధాలు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయి. కేసీఆర్ స్ఫూర్తితో మళ్లీ జాతీయ పార్టీల మెడలు వంచాల్సిన అవసరం ఉంది. 33 జిల్లా కేంద్రాల్లో, పార్టీ కార్యాలయాల్లో నవంబరు 29న దీక్షా దివాస్ ఘనంగా నిర్వహిస్తం. సీనియర్ నాయకులను ఇన్ ఛార్జ్ లను  నియమిస్తున్నం. నవంబర్ 26న సన్నాహక సమావేశాలు ఉంటాయి. 29న నిమ్స్ లో  పాలు, పండ్లు పంపిణీ చేస్తం. డిసెంబరు 9న మేడ్చల్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ, ఉత్సవాలు నిర్వహిస్తం. అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తు న్నం. కేసీఆర్ హాజరుకారు. ఇవి మేం ఆయనకు కృతజ్ఞత చెప్పుకునే కార్యక్రమాలు' అని కేటీఆర్ తెలిపారు.