త్వరలోనే 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు : కేటీఆర్

తెలంగాణలో  పార్టీ మారిన  పది అసెంబ్లీ స్థానాల్లో త్వరలోనే(2025) ఉపఎన్నికలు వస్తాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . ఉప ఎన్నికల్లో పార్టీన ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలన్నారు.    రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రంగారెడ్డి జల్లా షాబాద్ లో బీఆర్ఎస్ దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో కేటీఆర్ పాల్గొన్నారు.  ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..  కాంగ్రెస్ మేనిఫేస్టో ప్రకారం రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఆరుగ్యారంటీల్లో అర గ్యారంటీనే అమలయ్యిందన్నారు. అమలు కానీ హామీలతో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని విమర్శించారు.

రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాలనరి కేటీఆర్ డిమాండ్ చేశారు.  స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ నేతలను  నిలదీయాలన్నారు.  ఎకరాకు  రైతుకు రూ. 17500 రేవంత్ సర్కార్ బాకీ పడిందన్నారు.  రాష్ట్రంలో ప్రతీ మహిళకు రూ. 30 వేలు ప్రభుత్వం బాకీ పడిందని చెప్పారు.

ALSO READ | 2030 నాటికి మూసీ డెవలప్మెంట్ కంప్లీట్.. టార్గెట్ తో ముందుకెళ్తున్న ప్రభుత్వం..

వందరోజుల్లోనే హామీలన్నీ అమలు చేశామని ఢిల్లీలో చెప్పుకుంటున్నారని కేటీఆర్ అన్నారు.  2 లక్షల రుణం తీసుకోమ్మని ఎన్నికల ముందు చెప్పారు..రుణమాఫీ కాడా పూర్తిగా చేయలేదు.  రైతులు,మహిళలు సహా అందరినీ రేవంత్ మోసం చేశారని ధ్వజమెత్తారు.  రైతు రుణమాఫీపై అసెంబ్లీలో సవాల్ విసిరినా. ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామని సవాల్ చేశా కానీ ఇంత వరకు ముందుకు రాలేదన్నారు.  రాజీవ్ అభయం హస్తం కాస్త భస్మాసుర అస్తం అయ్యిందని విమర్శించారు కేటీఆర్.