కాంగ్రెస్ చెప్పేదొకటి.. చేసేదొకటి..! బోనస్ బోగస్ అయ్యింది:కేటీఆర్

కాంగ్రెస్ చెప్పేదొకటి.. చేసేదొకటి..! బోనస్ బోగస్ అయ్యింది:కేటీఆర్

కాంగ్రెస్ పై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుల నుంచి సన్న ధాన్యం కొనుగోలు విషయంలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిందని విమర్శించారు.  సన్నాలకు బోనస్ పు  కాంగ్రెస్  తప్పుడు లెక్కలు చెబుతోందని ట్వీట్ చేశారు.  సన్నాలకు రేవంత్‌ సర్కారు ఎగవేసిన బోనస్‌ రూ.1,561 కోట్లు.  సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ ఇస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ హామీ బోగస్‌ అయింది. 

ALSO READ | Rupee record low: రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి విలువ.. కారణాలివే..

సన్నాలు సాగు చేస్తే బోనస్‌ వస్తదని ఆశపడిన రైతులకు సర్కారు సున్నం పెట్టింది.  తద్వారా సన్నధాన్యం పండించిన రైతులకు సర్కారు ఎగ్గొట్టిన బోనస్‌ అక్షరాలా రూ.1,561 కోట్లు!  వానకాలం సీజన్‌లో 50 లక్షల టన్నుల సన్నాలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కొనుగోలు చేసింది కేవలం 18.78 లక్షల టన్నులేనని అన్నారు.