కాంగ్రెస్ పార్టీ గతం..ఆ పార్టీ పని ఖతం అంటూ సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. గ్యారంటీ లేని కాంగ్రెస్ ను నమ్మొద్దన్నారు. ఆరు గ్యారంటీలు కాదు..60 గ్యారంటీలు ఇచ్చినా కాంగ్రెస్ ను నమ్మొద్దన్నారు. జగిత్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ పాలనలో అన్నీ కష్టాలు..కన్నీళ్లేనని.. ప్రస్తుతం రాష్ట్రంలో నీళ్ల యుద్దాలు ఎక్కడా లేవన్నారు. జీవన్ రెడ్డి గతం, సంజయ్ కుమార్ భవిష్యత్ అని అన్నారు. రైతులకు నష్టం లేకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించామని చెప్పారు. అభివృద్ధి చేశాము కాబట్టే ఓట్లు అడుగుతున్నామని తెలిపారు కేటీఆర్.
కేసీఆర్ వల్లే జగిత్యాల జిల్లా అయిందని..ఆయన వల్లే అభివృద్ధి జరిగిందన్నారు కేటీఆర్. గత పాలకు జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఇంటింటికి నీళ్లు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ దేనన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ మరోసారి కేసీఆర్ సీఎం అవుతారు కానీ.. కాంగ్రెస్ గెలిస్తే ఆరు నెలలకోసారి సీఎం అభ్యర్థి మారుతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తో వచ్చేది లేదు..సచ్చేది లేదన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మెడికల్ కాలేజీ తెచ్చుకున్నామని చెప్పారు. రైతు బాగుండాలంటే రైతు నాయకుడు కేసీఆర్ ను గెలిపించాలని కోరారు కేటీఆర్.