మహిళా రిజర్వేషన్ బిల్లుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతోందని..బిల్లును తాము స్వాగతిస్తున్నాని చెప్పారు. ఒక వేళ మహిళా రిజర్వేషన్లో తన సీటు పోయినా బాధపడబోనన్నారు. ఎక్కువ మంది మహిళా లీడర్లు రావాలన్నారు. మన జీవితాలు చాలా చిన్నవని.. తన పాత్ర తాను పోషించానని చెప్పారు.
ALSO READ : ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రపంచానికే వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే స్థాయికి హైదరాబాద్ చేరుకుందని.. పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతమన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అండగా ఉంటామన్నారు. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ హబ్ గా మారుతుందన్నారు.