సీఎం రేవంత్ మీద పరువు నష్టం దావా వేస్తా: కేటీఆర్

సీఎం రేవంత్  మీద పరువు నష్టం దావా వేస్తా: కేటీఆర్

త్వరలో సీఎం రేవంత్ రెడ్డి మీద  పరువు నష్టం దావా వేస్తానన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  ఇప్పటికే ఒక మంత్రి మీద కేసు వేశానని చెప్పారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్లను ఎవరినీ వదిలిపెట్టబోనన్నారు.  మోదీకే భయపడలేదు.. చిట్టి నాయుడికి భయపడతమా అని అన్నారు కేటీఆర్.

కందుకూరు రైతు ధర్నాలో పాల్గొన్న  కేటీఆర్.. పాలనలో రేవంత్ విఫలమయ్యారని విమర్శించారు. అన్ని వర్గాలను రేవంత్ మోసం చేశారని చెప్పారు. మూసీ బ్యూటీఫికేషన్ కాదు..లూటిఫికేషన్ అని సెటైర్ వేశారు. రేవంత్ రెడ్డి కళ్లు శాంతిస్తాయంటే..తమవి కూలగొట్టు కానీ పేదల జోలికి మాత్రం వెళ్లొద్దన్నారు కేటీఆర్.  రేవంత్ రెడ్డికి  చిత్తశుద్ధి ఉంటే కొడంగల్ లోని రెడ్డి కుంటలో ఉన్న ఆయన ఇల్లును ముందు కూల్చాలన్నారు. పైసల పిచ్చి ఉంటే నాలుగు కోట్ల మంది చందాలు వసూలు చేసి రేవంత్ కు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు కేటీఆర్.

ALSO READ | ఆర్డినెన్స్‎కు గవర్నర్ ఆమోదం.. ఇకపై మరింత పవర్ ఫుల్‎గా హైడ్రా

ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ మార్చడానికి కోమటి రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కేటీఆర్.   మూసీ కంపు అంతా సీఎం నోట్లోనే ఉందన్నారు.  ఇందిరమ్మ ఇళ్లు కడతా అంటే కాంగ్రెస్ కు  ఓట్లు చేశారు కానీ.. కులగొడతా అంటే ఓట్లు వేయలేదన్నారు.  ఆరు గ్యారంటీల హామీలకు పైసలు లేవు  కానీ మూసీ సుందరీకరణ చేస్తారంటా అంటూ సెటైర్లు వేశారు కేటీఆర్.  మూసీ సుందరీకరణతో కాంగ్రెస్ నేతలు కమీషన్లు కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు.  పథకాలు అమలు చేస్తే కమీషన్ రాదని... అందుకే మూసీ ప్రక్షాళన అంటున్నారని విమర్శించారు కేటీఆర్.