గవర్నర్ ప్రసంగం కాదు..గాంధీభవన్ ప్రెస్ మీట్ : కేటీఆర్

గవర్నర్ ప్రసంగం కాదు..గాంధీభవన్ ప్రెస్ మీట్ : కేటీఆర్

అసెంబ్లీలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. గవర్నర్ ప్రసంగం గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లా ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  గత 15 నెలల అట్టర్ ప్లాప్  పాలనపై ప్రాయాచ్ఛిత్తం ఉంటుందనుకున్నాం..కానీ గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే ఉన్నాయన్నారు. కాంగ్రెస్  ప్రభుత్వాన్ని గవర్నర్ మందలిస్తారని అనుకున్నాం కానీ..కీలక అంశాలను ప్రభుత్వం మర్చిపోయిందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం రుణమాఫీ కూడా కాలేదు.  ఏ గ్రామంలో కూడా పూర్తి స్థాయి రుణమాఫీ కాలేదు.  మేడిగడ్డను 15 నెలలుగా ఎండబెట్టారు.  రేవంత్ అనే చేతకాని సీఎం వల్ల పంటలు ఎండిపోతున్నాయి. రైతు బంధు మొత్తం అందిందదని గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు. రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం తీవ్రమవుతోంది. 20 శాతం కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం.

Also Read :- గవర్నర్ ప్రసంగం మధ్యలో BRS సభ్యుల నినాదాలు..

 20 శాతం కమిషన్ ను నిరసిస్తూ కాంట్రాక్టర్లు  ఆర్థిక మంత్రి చాంబర్ ఎదుట నిరసన చేశారు. కేసీఆర్ పై కోపంతో  మేడిగడ్డ పనులు చేయట్లేదు.  కేసీఆర్ పదేళ్లలో 4లక్షల కోట్ల అప్పచేస్తే..రేవంత్  ఏడాదిలో లక్షా 13 వేల కోట్ల అప్పు చేశారు.  లక్ష కోట్ల అప్పు చేసినా ఒక్క పథకం ప్రారంభించలేదు. 30 శాతం కమిషన్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటున్నారు. దావోస్ లో లక్షా 70 వేల పెట్టుబడులు వచ్చాయని అబద్ధాలు చెప్పించారని కేటీఆర్ అన్నారు.