సింపుల్ లివింగ్..హై థింకింగ్ మన్మోహన్ స్టైల్ అని కొనియాడారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. అసెంబ్లీలో మన్మోహన్ కు సంతాప తీర్మానం సందర్భంగా మాట్లాడారు. మన్మోహన్ కు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు కేటీఆర్. మన్మోహన్ ప్రతిభను గుర్తించింది తెలంగాణ బిడ్డ పీవీ నరసింహరావు అని చెప్పారు కేటీఆర్. ఢిల్లీలో పీవీకి మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటుకు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయాలని సూచించారు. మన్మోహన్ సింగ్ నిరాడంబర మనిషి అని అన్నారు కేటీఆర్ .
Also Read : మన్మోహన్ సింగ్ అరుదైన, అసామాన్య మనిషి
మన్మోహన్ కేబినెట్ లో కేసీఆర్ మత్రిగా పనిచేశారని చెప్పారు కేటీఆర్. లేటరల్ ఎంట్రీ విధానంలోనే మన్మోహన్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. కేసీఆర్ ను కర్మయోగి అని మన్మోహన్ అన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఉన్న నిబద్ధతను మన్మోన్ అర్థం చేసుకున్నారని కేటీఆర్ అన్నారు. కొందరు ఆయనను మౌని ముని అన్నా..తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంస్కరణల్లో మన్మోహన్ వెనక్కి తగ్గలేదని చెప్పారు. మన్మోహన్ కు భారతరత్న ప్రతిపాదనతో పాటు.. మన్మోహన్ కు తెలంగాణలో విగ్రహ ఏర్పాటుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు కేటీఆర్.