ఆగస్టు 2 లోపు కాళేశ్వరం పంపు హౌసులు ఆన్ చేసి ప్రాజెక్టులకు నీళ్లివ్వాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లేదంటే కేసీఆర్ ఆధ్వర్యంలో 50 వేల మందితో తామే పంపు హౌసులు ఆన్ చేస్తామన్నారు. పంపులని ఆన్ చేస్తే రోజుకు 3 టీఎంసీలు నీటిని లిఫ్ట్ చేసి అన్ని రిజర్వాయర్లు నింపుకోవచ్చన్నారు. నీరు వృధాగా పోనిస్తున్నారు కానీ.. లిఫ్ట్ చేయట్లేదని ఆరోపించారు కేటీఆర్. చిన్న సమస్య తలెత్తితే కాళేశ్వరం ప్రాజెక్టుపై విష ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అసెంబ్లీలో నిలదీస్తామన్నారు.
కాళేశ్వరం పర్యటనలో భాగంగా కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు. 8 నెలలుగా నీళ్ళు లిఫ్ట్ చేయకుండా ప్రభుత్వం పంట పొలాలను ప్రాజెక్టులను ఎండపెడుతుందన్నారు.