
కేసీఆర్ రాజకీయనాయకుడు కాదు..ఎంతోమందికి పెద్ద కొడుకు లాంటివారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ను నడిపించే నాయకుడని తన ఎక్స్ లో ట్వీట్ చేశారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని ధారపోసిన దార్శనీకుడు ఎన్ని ఢిల్లీ పార్టీలు ఉన్నా.. తెలంగాణ ఇంటి పార్టీ బిఆర్ఎస్ అని చెప్పారు.
బీఆర్ఎస్ ఆఫీస్ కు వచ్చిన ఓ వృద్ధురాలు కేసీఆర్ గురించి చెప్పిన వీడియోను కేటీఆర్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.“బిడ్డా.. నాకు రెండువేల రూపాయిల పెన్షన్ వచ్చినాది!…నా పెద్ద కొడుకు కేసీఆర్ కి వెయ్యి రూపాయలు ఇవ్వు” ఇంత ఆప్యాయత, ప్రేమ తెలంగాణలో కేవలం కేసీఆర్ కే సొంతం. మాది పేగు బంధం.బోడ బాజీ అమ్మకి వందనం అని కేటీఆర్ అన్నారు.
Also Read :- ఫామ్హౌస్ నుంచి నేరుగా AIG ఆస్పత్రికి కేసీఆర్
మరో వైపు కేసీఆర్ కాసేటి క్రితమే హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. రెగ్యులర్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది.
“బిడ్డా…నాకు రెండువేల రూపాయిల పెన్షన్ వచ్చినాది!…నా పెద్ద కొడుకు కేసీఆర్ కి వెయ్యి రూపాయలు ఇవ్వు”….ఇంత ఆప్యాయత, ప్రేమ….తెలంగాణల కేవలం కేసీఆర్ కే సొంతం
— KTR (@KTRBRS) April 10, 2025
కేసీఆర్ ఒక రాజకీయ నాయకుడు కాదు….ఎంతో మందికి పెద్ద కొడుకు!
మా పార్టీని నడిపించే నాయకుడు 🙏🏽
తెలంగాణ కోసం తన జీవితాన్ని… pic.twitter.com/YyWygWDfPg