కేసీఆర్ కంటే బలమైన గొంతు దేశంలోనే లేదు: కేటీఆర్

ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే బలమైన గొంతు దేశంలోనే లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్.సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి స‌మావేశంలో మాట్లాడిన  కేటీఆర్..  అమ‌లు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింద‌ని విమర్శించారు. రూ. 2 ల‌క్షల  రైతు రుణ‌మాఫీ చేయ‌లేదు.. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది.. కరెంట్ క‌ష్టాలు మొద‌ల‌య్యాయని చెప్పారు. తెలంగాణ తెచ్చింది గులాబీ జెండానే..పోయింది అధికారం మాత్రమే.. పోరాట ప‌టిమ కాదన్నారు కేటీఆర్.

రేవంత్ రెడ్డి  ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని... ఢిల్లీ మేనేజ్‌మెంట్ కోటా ముఖ్యమంత్రని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వ‌చ్చేదా..? తెలంగాణ రాకుంటే సీఎం, డిప్యూటీ సీఎం ప‌ద‌వులు మీకు ద‌క్కేవా..? అని ప్రశ్నించారు. 

అధికారంలోకి వ‌స్తామ‌ని కాంగ్రెస్ కూడా న‌మ్మలేదు.. డిక్లరేషన్ పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు కటీఆర్.   ఉచిత బ‌స్సు ప‌థ‌కంతో ఆటో డ్రైవ‌ర్ల బ‌తుకులు ఆగమాగం అయ్యాయని అన్నారు. ఫ్రీ బ‌స్సు ప‌థ‌కంతో బ‌స్సుల్లో యుద్ధాలు జ‌రుగుతున్నాయి..ఏదైనా ప‌థ‌కం తెస్తే ఆలోచించి తేవాలన్నారు.  శ్వేత‌ప‌త్రం పెడితే.. ధీటుగా జ‌వాబిచ్చాం. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటేనే ప‌వ‌ర్ ఫుల్. కాంగ్రెస్, బీజేపీ ములాఖ‌త్ అయ్యాయని ఆరోపించారు.