కాంగ్రెస్ కు, బీజేపీకి గ్రీన్ కో బాండ్లు: కేటీఆర్

కాంగ్రెస్ కు,  బీజేపీకి  గ్రీన్ కో బాండ్లు: కేటీఆర్
  •  బీఆర్ఎస్ కు 2022లోనే బాండ్లు 
  • అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది
  • ఇది రేవంత్ రెడ్డి టీం దుష్ప్రచారం
  • మాజీమంత్రి కేటీఆర్ ఫైర్

హైదరాబాద్:  గ్రీన్‌కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రూ. కోట్ల ల‌బ్ధి చేకూరిన‌ట్లు కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘గ్రీన్‌కో 2022లో ఎన్నిక‌ల బాండ్లు ఇచ్చింది. 2023లో ఫార్ములా ఈ రేసు జ‌రిగింది.

 కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రీన్‌కో బాండ్లు ఇచ్చింది. ఫార్ములా ఈ రేసు కార‌ణంగా గ్రీన్ కో న‌ష్ట‌పోయింది. అందుకే మ‌రుస‌టి ఏడాది స్పాన్స‌ర్‌షిఫ్ నుంచి త‌ప్పుకుంది. అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది..? ఇది రేవంత్ రెడ్డి టీం చేస్తున్న దుష్ప్ర‌చారం. పార్ల‌మెంట్ ఆమోదించిన ఎన్నిక‌ల బాండ్లు అవినీతి ఎలా అవుతుంది. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీకు వ‌చ్చిన బాండ్ల‌పై చ‌ర్చ‌కు సిద్ధం’ అని కేటీఆర్ అన్నారు.

ALSO READ | వెనక్కి తగ్గని ఏసీబీ.. కేటీఆర్‎కు మరోసారి నోటీసులు