హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో అసలు నిజాలు ఏంటో అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో అద్వితీయ ప్రగతి సాధించిందన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రికార్డులు తిరగరాసిందని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ మన రైతన్నలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. దేశంలో ఒకవైపు ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే.. బియ్యం నిల్వల పేరుతో కేంద్రం రాష్ట్రాలకు మొండిచేయి చూపడం సరికాదన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయరంగంలో అద్వితీయ ప్రగతి సాధించింది. ఆహారధాన్యాల ఉత్పత్తిలో రికార్డులు తిరగరాసింది
— KTR (@KTRTRS) December 23, 2021
కానీ కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ మన రైతన్నలను ఇబ్బందులకు గురిచేస్తోంది.
ధాన్యం కొనుగోలు అంశంలో అసలు నిజాలు ఏమిటో తెలుసుకుందాం.
1/n pic.twitter.com/p6NB9l7VWP
ధాన్యం కొనుగోళ్ల విషయంలో స్పష్టమైన పాలసీ ప్రకటించాలని, అన్నదాతలను ఇబ్బందులకు గురిచేయొద్దని కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసిందని పేర్కొన్నారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని.. రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుందనేది తమ విధానమని ట్వీట్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎవరి పాత్ర ఎంత, రాష్ట్రాల వద్ద నుంచి సేకరించిన ధాన్యాన్ని కేంద్రం ఏం చేస్తుంది, కేంద్ర ప్రకటన రాష్ట్రానికి ఎందుకు ఇబ్బందిగా మారిందనే అంశాలను వివరిస్తూ పలు ఫొటోలను ఆయన ఈ ట్వీట్ కు జత చేశారు. తెలంగాణ నుంచి ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం కొనడం తమ వల్ల కాదంటూ కేంద్రం చేతులు ఎత్తేసిందన్నారు. రా రైస్ మాత్రమే కొంటామని, పారా బాయిల్డ్ రైస్ కొనేది లేదంటూ కొర్రీలు పెడుతోందని దుయ్యబట్టారు.
మరిన్ని వార్తల కోసం: