తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా? ఆదుకోదా?

మానవ తప్పిదాలతోనే హైదరాబాద్ లో భారీ వరదలు వచ్చాయన్నారు మంత్రి కేటీఆర్. చెరువులు ,నాలాల కబ్జాలతోనే ప్రజలు ఇబ్బంది ఎదుర్కొన్నారన్నారు. చరిత్రలోనే అతిభారీ వర్షాలు ఈ సారి కురిశాయన్నారు మంత్రి కేటీఆర్.1916 తర్వాత భారీ వర్షం సిటీలో కరిసిందన్నారు. క్లైమేట్ చేంజ్ తో అతిభారీ వర్షాలు పడ్డాయన్నారు.  800 మంది సిబ్బందితో డీఆర్ఎఫ్ ను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఏ నగరానికి డీఆర్ఎఫ్ టీం లేదన్నారు. సహాయక చర్యల్లో టీఆర్ఎస్ నేతలంతా పాల్గొన్నారన్నారు. తాను కూడా చాలా కాలనీల్లో తిరిగి ప్రజలకు ధైర్యం చెప్పానన్నారు. వర్షం పడుతున్నపుడే సీఎం వరద సాయం ప్రకటించారన్నారు. తక్షణ సాయం కింద రూ.550 కోట్లు సీఎం ఇచ్చారన్నారు. ఎవరికి సాయం చేశామో అంతా రిపోర్ట్ ఉందన్నారు. 4 లక్షల 30 వేల మందికి సాయం చేశామన్నారు. ఆధార్, హౌస్ నెంబర్ తో సహా డీటేల్స్ ఉన్నాయన్నారు. దసరా లోపే సాయం అందించాలని చూశామన్నారు. ఏ ప్రభుత్వం కూడా వెంటనే చేతికి డబ్బులివ్వలేదన్నారు.

రూ. 8860 కోట్ల నష్టం జరిగిందని సీఎం ప్రధానికి లెటర్ రాస్తే  పైసా ఇవ్వలేదన్నారు కేటీఆర్. గుజరాత్ లో వరదలొస్తే రూ. 500కోట్లు ఇచ్చారన్నారు. కర్ణాటక సీఎం లెటర్ రాయగానే కేంద్రం రూ.669 కోట్లు వెంటనే ఇచ్చారన్నారు. రూ. 1300 కోట్లు అడిగితే కేంద్రం నయా పైసా ఇవ్వలేదన్నారు.  గుజరాత్, కర్ణాటకే దేశంలో అంతర్భాగమా? తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా? కేంద్రం ఆదుకోదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయన్నారు కేటీఆర్. వరదలు వచ్చినప్పుడు ఎవ్వరూ ప్రజల్లో లేరని.. ఇప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారన్నారు.  జోనల్ కమిషనర్ ఆఫీస్ లకు వెళ్లి అధికారులను బెదిరించినట్లు మాట్లాడుతున్నారన్నారు.  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి నిస్సహాయంగా ఎందుకు? ఉన్నాని ప్రశ్నించారు . ఇన్ని రోజులు ప్రతిపక్షాల మాటలు విని భరించాం కానీ ఇక భరించలేమన్నారు.