వరంగల్‌లో నవంబర్ 15న తెలంగాణ విజయగర్జన

వరంగల్ లో నవంబర్ 15న  తెలంగాణ విజయ గర్జన బహిరంగ సభ ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. సభకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు లక్షలాదిగా తరలివస్తారన్నారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఇప్పటికే గ్రామ టీఆర్ఎస్ కమిటీలు అన్ని పూర్తిచేశామన్నారు. అక్టోబర్ 15న టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి షెడ్యూల్ ఉంటుందన్నారు. 17న టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ ఉంటుందన్నారు.    25న పార్టీ ప్లీనరీ ఉంటుందని.. అదే రోజు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారన్నారు.   27న అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ విజయగర్జన సన్నాహక సమావేశాలుంటాయన్నారు. నవంబర్ 15 తర్వాత పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలు ఉంటాయన్నారు. అధ్యక్ష ఎన్నిక తర్వాత జిల్లా అధ్యక్షుల ఎన్నిక ఉంటుందన్నారు హుజూరాబాద్ ఎన్నిక సీరియస్ కాదని... చర్చనీయాంశం కూడా కాదన్నారు.