భారత్ లో హైదరాబాద్ ను మించిన సిటీ లేదన్నారు మంత్రి కేటీఆర్. బేగంపేటలోని మ్యారిగోల్డ్ హోటల్ లో వ్యాపారవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మట్లాడిన కేటీఆర్.. అభివృద్ధిలో బెంగుళూరు, ముంబై, ఢిల్లీ వంటి అన్ని నగరాలకంటే హైదరాబాద్ మంచి పొజిషన్ లో ఉందన్నారు. అది కేంద్ర ప్రభుత్వమే గుర్తించి సర్టిఫికెట్ కూడా ఇచ్చిందన్నారు. సిటీలో మొత్తం కనెక్టివిటీ రోడ్ లు వేస్తున్నామన్నారు. డ్రైనేజి వ్యవస్థని మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆరేళ్లలో హిందు-ముస్లిం, ఆంధ్ర-తెలంగాణ లొల్లులు లేవన్నారు. కానీ ఈ ఎన్నికల్లో ప్రత్యర్థుల మాటలతో అల్లర్లు చెలరేగేలా ఉన్నాయన్నారు.మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. సిటీలో కమ్యూనిటీ గొడవలు లేవన్నారు. ఏం అభివృద్ధి చేస్తారో చెప్పి ఓట్లు అడగాలన్నారు. హిందు-ముస్లీం అంటూ నిప్పు పెట్టాలని చూస్తే వాళ్ళకే మంచిదికాదన్నారు. ఇలాంటి వారిని ఎదురించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరగాలంటే ప్రశాంత వాతావరణం ఉండాలన్నారు.
కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు చూస్తే వాళ్లకు బాత్రూమ్ కూడా వస్తలేదు