ఎంఐఎంతో పొత్తు లేదు..150 సీట్లలో సింగిల్ గానే

ఎంఐఎంతో పొత్తు లేదు..150 సీట్లలో సింగిల్ గానే

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐతో పొత్తు లేదన్నారు మంత్రి కేటీఆర్. 150 సీట్లలో సింగిల్ గానే పోటీ చేస్తామన్నారు. టీఆర్ఎస్ కు చెందిన మహిళ అభ్యర్థి మేయర్ అవుతారన్నారు. గతంలో పాతబస్తీలో 5 సీట్లు గెలిచామన్నారు.అభివృద్ధి నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. ఎల్ఎఆర్ఎస్ లో కేంద్రం జోక్యం ఉండదన్నారు. ఆస్తిపన్ను అన్ని మున్సిపాలిటీల్లో తగ్గించామన్నరు. ధరణి పోర్టల్ తో కోటి మంది లబ్ధిపొందారన్నారు.

వర్షం పడుతుంటేనే ,వరద సాయం ప్రారంభించామన్నారు కేటీఆర్.  మీ సేవా సెంటర్ల ముందు క్యూలు ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. హైదరాబాద్ చుట్టు ప్రక్కల రెండు లక్షల మందికి సాయం చేశామన్నారు. అందరీకి వరద సాయం చేస్తామన్నారు. వరదలు వస్తే కేంద్రం సాయం చేయలేదన్నారు. కర్ణాటక,గుజరాత్ లకు సాయం చేసిన కేంద్రం తెలంగాణకు చేయలేదన్నారు.