KTR: ఇవాళ రాఖీ కట్టలేకపోయినా..ఎప్పటికీ అండగా ఉంటా: కేటీఆర్

KTR: ఇవాళ రాఖీ కట్టలేకపోయినా..ఎప్పటికీ  అండగా ఉంటా: కేటీఆర్

దేశ వ్యాప్తంగా రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కడుతున్నారు.అన్నాచెల్లెల్ల మధ్య ఉన్న అనుభంధాన్ని,ప్రేమను చాటుతున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోదరి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను గుర్తు చేసుకున్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. పండుగ వేళ తన సోదరిని గుర్తు చేసుకున్న కేటీఆర్..గతంలో  కవిత  రాఖీ కట్టిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఇవాళ రాఖీ కట్టలేకపోయినా..ఎప్పటీకీ నీకు అండగా ఉంటానని ట్వీట్ చేశారు.


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత దాదాపు 5  నెలలుగా జైలులోనే ఉన్నారు. మార్చి 15న ఈడీ అధికారులు ఆమెను  హైదరాబాద్​లోని తన నివాసంలో అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు.  మార్చి 26న ట్రయల్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆమెను తిహార్ జైలుకు తరలించారు. ఆమె జైలులో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ అదుపులోకి తీసుకుంది. తనను అక్రమంగా కేసుల్లో ఇరికించారని బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత వేసిన పిటిషన్లను ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టులు తిరస్కరించాయి. ప్రస్తుతం కవిత జ్యూడిషియల్ కస్టడీని ఢిల్లీ ట్రయల్ కోర్టు సెప్టెంబర్ 2 వరకు  పొడిగించిన సంగతి తెలిసిందే..